అటెండర్ టు ఐఏఎస్, 6,729 మంది ఉద్యోగులు తొలగింపు… రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం
పదవీ విరమణ చేసి కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న వారిపై వేటు వేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో అటెండర్ నుంచి ఐఏఎస్ దాకా కాంట్రాక్టు పద్ధతిలో సేవలందిస్తున్న 6,729 మంది ఉద్యోగులను తొలగించారు. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
వారిలో అవసరమైన వారిని తిరిగి నియమించుకునే ఛాన్స్ ఉంది.
తొలగించిన వారిలో మెట్రోరైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి, యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ(వైటీడీఏ) వైస్ చైర్మన్ జి.కిషన్‌రావు, కన్సల్టెంట్ ఇంజినీరు బీఎల్‌ఎన్ రెడ్డి సహా, ట్రాన్స్‌కో, జెన్‌కో డైరెక్టర్లు ఈ జాబితాలో ఉన్నారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కొత్త నియామకాలకు అవకాశం వస్తుందని నిరుద్యోగులు భావిస్తున్నారు.