
రైతుకు మద్దతేది?
అందరికీ అన్నం పెట్టేవాడే రైతు.ఇప్పుడు ఆ రైతే కనపడని స్థితికి ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయి.అతివృష్టి,అనావృష్టిలతో యుద్ధం చేస్తూ నాగలి పట్టిన రైతన్నకు పాలకులు తోడ్పాటు ఏ రకంగానూ ఉండటం లేదు. ప్రత్యామ్నాయ పనులతో జీవితాన్ని నెట్టుకొస్తున్నారు తప్ప వ్యవసాయం పైనే ఆధారపడాలంటే చావే శరణ్యమన్న ఆలోచనకు పురికొల్పే విధానాలు ఎక్కువయ్యాయి.శక్తినంతా ధారపోసి వ్యవసాయాన్ని కొనసాగిస్తున్న రైతుది తప్పా?.. ‘అదంతా మాకు సంబంధం లేదు మేం ప్రకటించిన మద్దతు ధరతో పంటలు అమ్ముకోండి,లేకపోతే మీ చావు మీరు చావండి’అంటున్న కేంద్ర…