బెట్టింగ్‌ యాప్స్‌ వ్యవహారంలో దూకుడు పెంచిన పోలీసులు

బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కొనసాగుతున్న విచారణ..బెట్టింగ్ యాప్ పై దూకుడు పెంచిన మియాపూర్ పోలీసులు.పలు కంపెనీలపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు..సినీ యాక్టర్స్ ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ గుర్తించిన పోలీసులుజంగిల్ రమ్మీ యాప్ కోసం రానా, ప్రకాష్ రాజ్ ప్రమోట్ చేసినట్లు గుర్తింపు..ఏ 23 యాప్ కోసం విజయ్ దేవరకొండ ప్రచారం చేసినట్లు గుర్తింపుయోలో 247 యాప్ కోసం మంచు లక్ష్మి పని చేసినట్లు గుర్తింపుఫెయిర్ ప్లే లైవ్ యాప్ కోసం ప్రచారం చేసిన హీరోయిన్…

Read More

అంతా నిజమే చెబుతా.. ఈటెలతో కమిషన్ ప్రమాణం

కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఈరోజు (శుక్రవారం) బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓపెన్ కోర్టులో ఈటెలతో అంతా నిజమే చెప్తానని కమిషన్ ప్రమాణం చేయించింది. అనంతరం కమిషన్ ప్రశ్నలు సంధించింది. కమీషన్ ముందు 113వ సాక్షిగా మాజీ మంత్రి హాజరయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు విచారణ సాగింది. బ్యారేజీల నిర్మాణం, కాలేశ్వరం కార్పొరేషన్, డీపీఆర్‌పై మొత్తం 19 ప్రశ్నలను కమిషన్…

Read More

బీటెక్ సీట్లు ఫస్ట్ ఫేజ్‌లోనే 93 శాతం భర్తీ..!!

రాష్ట్రవ్యాప్తంగా 77,561 మందికి అలాట్‌మెంట్అత్యధికంగా సీఎస్‌ఈలో 57,042 సీట్లు నిండినయ్82 కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీవిద్యార్థులు కాలేజీల్లో రిపోర్ట్ చేసేందుకు ఈ నెల 22 వరకు చాన్స్‌ హైదరాబాద్, రాష్ట్రంలో బీటెక్ ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్‌మెంట్ ప్రక్రియ పూర్తయింది. టీజీ ఎప్ సెట్ తొలి విడత సీట్ల కేటాయింపులోనే 93.3 శాతం భర్తీ అయ్యాయి. ఈ వివరాలను శుక్రవారం టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 172 ఇంజినీరింగ్ కాలేజీలు ఉండగా, వాటిలో…

Read More

మహా నగరంలో మహా సముద్రం

రోజురోజుకి పెరుగుతున్న హైదరాబాదీ కష్టాలు అస్తవ్యస్తంగా తయారైన డ్రైనేజీ మహానగరం వ్యవస్థ భారీ వర్షాలతో సకాలంలో డ్యూటీలకు హాజరుకాలేకపోతున్న ఉద్యోగులు హైదరాబాద్.. కలల మహానగరం, అవకాశాలకు నిలయం. కానీ వర్షాకాలం వచ్చిందంటే చాలు, ఈ మహానగరం ముసుగు తొలగిపోతుంది. ఆకాశం కరుణ లేకుండా కుండపోతగా కురిసిన వర్షాలకు, రోడ్లు నదుల్లా మారిపోతాయి, కాలనీలు చెరువుల్లా కనిపిస్తాయి. కొన్ని గంటల పాటు కురిసే ఈ వర్షాలు హైదరాబాద్ ప్రజలకు భయాన్ని, నిస్సహాయతను మిగుల్చుతున్నాయి. ఆఫీసులకు వెళ్లేవారికి, పాఠశాలలకు వెళ్లే…

Read More

అక్కను ప్రేమించాడని ఆసుపత్రిలో నరికేశాడు… తమిళనాడులోని తిరునల్వేలిలో పురువు హత్య

తమిళనాడులో పరువు హత్య కలకలం రేపింది. తిరునల్వేలిలో ఆదివారం పట్టపగటు 27 ఏళ్ల పాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను దారుణంగా హతమార్చారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కవిన్‌ ఆసుపత్రిలో ఉండగానే దుండగుడు నరికి చంపేశాడు. పోలీసుల దర్యాప్తులో పరువు హత్యగా తేల్చారు. అక్కను ప్రేమించాడని హత్య చేశాడు తమ్ముడు సుర్జిత్. సుర్జిత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు సూర్జిత్‌ తల్లిదండ్రులు ఇద్దరూ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ వాళ్లే కావడం గమనార్హం. కవిన్‌ దారుణ హత్య వెనుక అమ్మాయి సోదరుడితోపాటు, ఆమె తల్లిదండ్రుల హస్తం…

Read More

మృత్యువు ఎలా వస్తుందో ఎవరికి తెలియదు….అప్పటిదాకా బాగానే ఉన్నా ఆమె… వాటర్ కోసం ఫ్రిజ్‌ డోర్‌ తీస్తుండగా షాక్ కొట్టి మ‌హిళ మృతి

హైద‌రాబాద్‌లోని రాజేంద్ర న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఘ‌ట‌న‌ ఫ్రిజ్‌ డోర్‌ తీస్తుండగా షాక్‌ కొట్టి ఓ మ‌హిళ మృతిచెందిన విషాద ఘ‌ట‌న హైద‌రాబాద్‌లోని రాజేంద్ర న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో సోమ‌వారం చోటుచేసుకుంది. ఎస్ఐ కిశోర్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం… హైద‌ర్‌గూడ ఎర్ర‌బోడ‌కు చెందిన లావ‌ణ్య‌(40)కు ముగ్గురు కూతుళ్లు. భ‌ర్త ప‌దేళ్ల కింద మృతిచెంద‌గా, ఇళ్ల‌లో ప‌నిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. గ‌తేడాది పెద్ద‌కూతురుకు పెళ్లి చేసింది. ఆమెకు కుమారుడు పుట్ట‌డంతో పుట్టింట్లోనే ఉంది. నిన్న ఇంట్లోని…

Read More

HCU ఉద్యమానికి సారథ్యం వహించలేదు.. అండగా నిలబడ్డాం: KTR

HCU భూముల అంశంలో విద్యార్థులు, ప్రజలు,ప్రముఖులు స్పందించిన తర్వాత BRS వారికి అండగా నిలిచిందని కేటీఆర్ అన్నారు. విద్యార్థుల ఉద్యమానికి తామేమి సారథ్యం వహించలేదని.. ప్రధాన ప్రతిపక్షంగా అండగా నిలబడ్డామని చెప్పారు. విద్యార్థులపై కేసులు వెనక్కి తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నాం. ప్రభుత్వం కేవలం విద్యార్థులపై కేసులు ఉపసంహరిస్తే సరిపోదు. అక్కడి అడవికి, వన్యప్రాణుల మరణాలకు కారణమైన వారిపైన కేసులు నమోదు చేయాలి’ అని డిమాండ్ చేశారు.

Read More

ఎలాన్ మస్క్ కొత్త పార్టీ పేరు “ ది అమెరికా పార్టీ “

అమెరికాలో కొత్త పార్టీ పెట్టేందుకు ఎలాన్ మస్క్ సిద్ధమవుతున్నారు. ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన “బిగ్ బ్యూటిఫుల్ బిల్” ఆమోదం లభించిన తర్వాత రోజే తాను పార్టీ పెడతానని ఆయన ప్రకటించారు. ఈ బిల్లు అమెరికాను దివాలా తీయిస్తుందని ఎలాన్ మస్క్ గట్టిగా నమ్ముతున్నారు. ఈ బిల్లును ప్రతిపాదించిన కారణంగానే ఆయన ట్రంప్‌కు గుడ్ బై చెప్పారు. అయితే రాజకీయాల్ని మాత్రం వదలడం లేదు. ఆ బిల్లుపై తన వ్యతిరేకత కొనసాగిస్తున్నారు. ఈ బిల్లులో ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహన…

Read More

బీజేపీ వైపు మల్లారెడ్డి ఫ్యామిలీ ?

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి బీజేపీ వైపు చూస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ రాజకీయాల్లో పెద్దగా కనిపించని మల్లారెడ్డి కుటుంబం ఇప్పుడు బండి సంజయ్ తో పరిచయాలు పెంచుకుంటోంది. మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఇటీవల చురుకుగా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆమెకు చాలా రాజకీయ ఆసక్తి ఉంది. వచ్చే ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి తానే పోటీ చేస్తానని ఓ సందర్భంలో ఆమె అన్నట్లుగా ప్రచారం జరిగింది. ఇలాంటి సమయంలో ప్రీతిరెడ్డి బండి సంజయ్ ద్వారా బీజేపీలో…

Read More

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!!

తెలంగాణలోని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి పదవీ కాలాన్ని మార్చి 31, 2026 వరకు పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సర్కార్ నిర్ణయంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లోని పని చేస్తున్న 12,055 మంది ఉద్యోగులకు లాభం చేకూరనుంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగుల సేవలు దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది….

Read More
error: Content is protected !!