
అంతా నిజమే చెబుతా.. ఈటెలతో కమిషన్ ప్రమాణం
కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఈరోజు (శుక్రవారం) బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓపెన్ కోర్టులో ఈటెలతో అంతా నిజమే చెప్తానని కమిషన్ ప్రమాణం చేయించింది. అనంతరం కమిషన్ ప్రశ్నలు సంధించింది. కమీషన్ ముందు 113వ సాక్షిగా మాజీ మంత్రి హాజరయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు విచారణ సాగింది. బ్యారేజీల నిర్మాణం, కాలేశ్వరం కార్పొరేషన్, డీపీఆర్‌పై మొత్తం 19 ప్రశ్నలను కమిషన్…