ఇష్టం వచ్చినట్లు మాట్లాడటానికి ఇదేం సినిమా కాదు: ప్రకాశ్ రాజ్

రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో ప్రజా సమస్యల గురించి మాట్లాడిన పవన్ కల్యాణ్, అధికారంలోకి వచ్చాక మాత్రం వాటిపై దృష్టిపెట్టడం లేదని నటుడు ప్రకాశ్ రాజ్ అన్నాడు. “ఇష్టమొచ్చినట్లు మాట్లాడటానికి ఇదేం సినిమా కాదు. అధికారంలో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించకుండా సమయం ఎందుకు వృథా చేస్తున్నారు?” అని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. సనాతన ధర్మానికి తాను వ్యతిరేకిని కాదన్నారు.

Read More

ప్రాదేశిక ఎన్నికలపై బిగ్ అప్‌డేట్.. బ్యాలెట్ పేపర్ల కలర్ ఫిక్స్..!!

తెలంగాణ హైకోర్టు రాష్ట్రంలో త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఎలక్షన్స్‌కు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు స్పీడప్ పెంచారు. ఈ క్రమంలో బ్యాలెట్ పేపర్ల కలర్లను ఫైనల్ చేశారు. ఎంపీటీసీకి గులాబీ, జెడ్పీటీసీకి తెలుపు రంగు బ్యాలెట్వినియోగించనున్నారు. దీనిపై ఇప్పటికే జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్సిబ్బందిని నియమిస్తున్నారు. పోలింగ్, బ్యాలెట్పేపర్, బ్యాలెట్బాక్సులు, స్టేషనరీ తదితర వాటన్నింటినీ మరోసారి సరిచూసుకొని సిద్ధంగా ఉండాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది….

Read More

మూఢనమ్మకాల మంటల్లో మానవత్వం!

సమాజంలో పాతుకుపోయిన మూఢనమ్మకాలకు నిదర్శనం బాణామతి లేదా చేతబడి. దాని పేరు మీద అన్యాయంగా సాటి వ్యక్తుల ప్రాణాలు తీస్తున్న ఉదంతాలు తరచూ వెలుగు చూస్తున్నాయి. బడుగు, బలహీన వర్గాలు… ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఈ దుర్మార్గాలకు బాధితులవుతున్నారు. బాణామతికి పాల్పడ్డారనే నెపంతో బిహార్‌లోని టెట్గామా గ్రామంలో ఇటీవల ఒక గిరిజన కుటుంబంలోని అయిదుగురు సభ్యులను చుట్టుపక్కల వ్యక్తులు చావబాది నిప్పంటించి హతమార్చారు. చనిపోయినవారిలో ముగ్గురు మహిళలున్నారు. బాణామతి లేదా చేతబడి చేశారనే ఆరోపణలతో ఆదివాసీ, దళిత,…

Read More

ఫ్లైట్ క్రాష్ వెనుక విద్రోహచర్య ?

అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం ఏవియేషన్ నిపుణులను ఆశ్చర్య పరుస్తోంది. లండన్ వెళ్లడానికి ఇలా గాల్లోకి లేచిన నిమిషంలోపే కుప్పకూలిపోయింది. టేకాఫ్‌కు ఏటీసీ నుంచి పైలట్ పర్మిషన్ తీసుకుని రన్ వే నుంచి విమానాన్ని గాల్లోకి లేపారు. వెంటనే అత్యంత ప్రమాదకర పరిస్థితిని వివరించే మేడే కాల్‌ను ఏటీసీకి చేశారు. ఆ తర్వాత నిమిషంలోనే ఫ్లైట్ తెగిన గాలిపటంలా అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలోనే ఉన్న ఓ మెడికల్ కాలేజీ హాస్టల్ పై కూలిపోయింది. విమానం కూలిపోతున్న…

Read More

బంగారం బిస్కెట్లు ఇస్తానని నమ్మించి, చివరికి డబ్బుతో ఉడాయించాడో ఘరానా మోసగాడు

చీటీ పాటల తరహాలో ఓ స్కీం పెట్టిబంగారం బిస్కెట్లు ఇస్తానని నమ్మించి, చివరికి డబ్బుతో ఉడాయించాడో ఘరానా మోసగాడు చీటీ పాటల తరహాలో ఓ స్కీం పెట్టి, పాడుకున్న వారికి బంగారం బిస్కెట్లు ఇస్తానని నమ్మించి, చివరికి డబ్బుతో ఉడాయించాడో ఘరానా మోసగాడు. విజయవాడలో జరిగిందీ ఘటన. అయోధ్యనగర్‌కు చెందిన ముచ్చర్ల శ్రీనివాస్‌ గతంలో పచ్చళ్ల వ్యాపారం చేస్తూ స్థానికులతో మంచి పరిచయాలు పెంచుకున్నాడు. పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తుండటంతో అందరూ అతడిని నమ్మారు. గతంలో చీటీలు…

Read More

అదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు!

అదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు! పలుచోట్ల వరదకు కొట్టుకుపోయిన రోడ్లు బుధవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాలతో రహదారి మార్గంలోని అందకూర్ అలుగు ఉధృతంగా ప్రవహించడం మూలంగా అక్కడి ప్రాంతంలోని రోడ్డు భారీ పరిమాణంతో కోతకు గురైంది. రోడ్డుకు ఒక వైపు అధిక భాగం కోతకు గురికావడం మూలంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది, అదిలాబాద్ నుంచి హైదరాబాద్ మార్గంలో వెళ్లే వాహనదారులకు నిర్మల్ పోలీసులు పలు సూచనలు చేశారు. ఆదిలాబాద్ నుంచి కామా రెడ్డి,మీదుగా…

Read More

జగన్ అరెస్టుకు ముహుర్తం ఫిక్స్..! సన్నిహితులతో సాయిరెడ్డి వెల్లడి ?

ఏపీ మద్యం కుంభకోణంపై కూటమి ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే ఈ స్కాంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, రాజ్ కెసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డితో పాటు రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, జగన్ మాజీ ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను నిందితులుగా చేర్చి, వీరిలో కొందరని అరెస్టు చేసి జైలుకు కూడా పంపారు. ఈ నేపథ్యంలో ఇక తదుపరి అరెస్టు మాజీ సీఎం వైఎస్ జగన్ దేనన్న ప్రచారం ముమ్మరంగా…

Read More

ముంబైకి కొడాలి నాని.. కారణమిదే

మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానిని మెరుగైన చికిత్స కోసం ముంబైకి తరలించారు. కొద్దిరోజుల క్రితం కొడాలి నాని తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. గత ఐదు రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. గుండెకు సంబంధించిన సమస్యతో మాజీ మంత్రి బాధపడుతున్నారు. ఈ క్రమంలో మెరుగైన వైద్యం కోసం కుటుంబసభ్యులు ఆయనను తీసుకుని కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక విమానంలో ముంబైకు బయలుదేరి వెళ్లారు. మెరుగైన చికిత్స కోసం ముంబైకి…

Read More

ఫార్ములా కేసులో ఇక అరెస్టులు ?

ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఇప్పటి వరకూ ఎలాంటి అరెస్టులు చేయలేదు. కానీ గురువారం ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ప్రశ్నించిన తర్వాత దర్యాప్తు అధికారులు అరెస్టులపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకే డబ్బు తరలించానని అర్వింద్ కుమార్ చెబుతున్నారు. ఎలాంటి నిబంధనలు పాటించలేదని ఆయన అంగీకరిస్తున్నారు. ఆయన ఈ సమయంలో కేటీఆర్ కు మద్దతుగా మాట్లాడే అవకాశాలు కనిపించడం లేదు. రెండు రోజుల కిందట కూడా ఆయనపై ఓ…

Read More

కొత్త సీజేగా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం

తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ (ఏకే సింగ్) ప్రమాణ స్వీకారం చేశారు.రాజ్ భవన్ లో మధ్యాహ్నం 12:30 గటంలకు జస్టిస్ ఏకే సింగ్ తో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ జితేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారుు, డీజీపీ, హైకోర్టు న్యాయమూర్తులు, తెలంగాణ మంత్రులు…

Read More
error: Content is protected !!