షాద్ నగర్ లో దాబాలో రూ. 3కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత..

షాద్ నగర్ లో దాబాలో రూ. 3కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత..

సైబరాబాద్‌ పరిధిలో భారీగా హెరాయిన్‌ పట్టివేత

ఒకటిన్నర కిలోల హెరాయిన్‌ స్వాధీనం

షాద్‌నగర్‌లోని ఓ దాబాలో డ్రగ్స్‌ విక్రయిస్తున్న ముఠా

హెరాయిన్‌తోపాటు గంజాయి, ఓపీఎం డ్రగ్స్‌ పట్టివేత

మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరిని పట్టుకున్న పోలీసులు

డ్రగ్స్‌ను ఎక్కడికి అక్కడ కట్టడి చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు.. కానీ గ్రామ స్థాయిల వరకు డ్రగ్స్ వాడకం పెరిగిపోయిందని అధికారులు గుర్తించ లేకపోతున్నారు.. ఏకంగా జాతీయ రహదారుల వెంబడి ఉన్న దాబాలు హోటల్స్‌లో ఈ డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతుంది.. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని దాబాలలో డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్ముతున్నారు.. మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక మార్వాడి కొన్నాళ్ల క్రితం షాద్‌నగర్ ప్రాంతానికి వచ్చి దాబా ఏర్పాటు చేసుకున్నాడు..

మధ్యప్రదేశ్ నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ని తీసుకువచ్చి తన కస్టమర్లకు అమ్ముతుండేవాడు. ఇటీవల కాలంలో సదరు డాబా యజమాని చనిపోయాడు. అయితే అందులో కుక్ గా చేరి చివరికి మేనేజర్ స్థాయికి చేరుకున్నారు.. డ్రగ్స్ ను మధ్యప్రదేశ్ నుంచి తెప్పించి అమ్మడం మొదలు పెట్టాడు.. ఎవరికి ఎలాంటి డ్రగ్స్ కావాలన్నా ఈజీగా అమ్మేస్తున్నారు..

సైబరాబాద్ పోలీసులకు వచ్చిన సమాచారంతో దాబాపై నిఘా పెట్టి డ్రగ్స్ పట్టుకున్నారు.. ఏకంగా కిలోన్నార హెరాయిన్‌తో పాటు గంజాయి, ఓపియంతో పాటు మరికొన్ని రకాల డ్రగ్స్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఏకంగా డ్రగ్స్ సూపర్ మార్కెట్‌ను పెట్టేసి అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు.. దాదాపు మూడు కోట్ల పైచిలుకు విలువచేసే డ్రగ్స్ ను అధికారులు స్వాధీన పరుచుకున్నారు.. దాబాలోని డ్రగ్స్ అమ్ముతుండగానే చూసి ఒక్కసారిగా అధికారులు అవ్వక్కయ్యారు. ప్రస్తుతం సైబరాబాద్ కమిషనరేట్ లో దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!