- మాజీ మంత్రి విడుదల రజనికి షాక్
- హైదరాబాద్ లో మరిది గోపీ అరెస్టు
- విశాఖ ఎయిర్ పోర్టులో రజని అడ్డగింత
మాజీమంత్రి విడదల రజిని మరిది విడదల గోపీని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని విప్రో సర్కిల్ వద్ద గురువారం తెల్లవారుజామున ఏసీబీ అధికారులు గోపిని అరెస్ట్ చేసి గచ్చిబౌలి స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి ఆయన్ను విజయవాడ తరలించారు.
వైసీపీ పాలన హయాంలో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీ స్టోన్ క్రషన్ నిర్వాహకులను బెదిరించి రూ.2. 20 కోట్లు వసూలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో మాజీమంత్రి విడుదల రజనితోపాటు ఆమె మరిది గోపిపైనా కేసు నమోదైంది. వీరికి సహకరించిన ఐసీఎస్ అధికారి జాషూవా సహా మాజీ మంత్రి రజని పీఏ రామకృష్ణపైనా కేసు నమోదు చేసింది.
ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం మాజీమంత్రి రజనీతోపాటు ఆమె మరిది గోపి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ హైకోర్టులో విచారణ దశలో ఉండగానే ఏసీబీ అధికారులు గోపిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. ఈ కేసు కొట్టివేయాలంటూ విజిలెన్స్ అధికారి జాషువా సైతం క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ సైతం విచారణ దశలోనే ఉంది. ఈ కేసులో సహ నిందితురాలిగా ఉన్న విడదల రజనీ విదేశాలకు వెళ్లకుండా రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రస్తుతం ఆమెను విశాఖపట్నం ఎయిర్ పోర్టులో నిర్బంధించినట్టు సమాచారం.

