ముంబై ని ముంచెత్తిన వరద!
దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అస్తవ్యస్తమైంది. అనేక ప్రాంతాలు నీట మునిగి జనజీవనం స్తంభించింది. మరోవైపు భారత వాతావరణ శాఖ ఇవాళ రెడ్ అలర్ట్ జారీ చేయగా.. బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అప్రమత్త మైంది.మంగళ వారం నగరంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది. ఎడతెరిపిలేని వానల కారణంగా ముంబైలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది….
